- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా టూ కాకినాడ: గంజాయి ముఠా గుట్టురట్టు.. రూ. 50 లక్షల సరుకు సీజ్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) నర్సీపట్నం పరిధి(Narsipatnam area)లో పోలీసులు భారీ గంజాయి(Marijuana) స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా(SP Tuhin Sinha)కు అందిన ముందస్తు సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు.. కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్‌లో భాగంగా గంజాయి తరలింపుకు వినియోగిస్తున్న ఒక కారు, మూడు బైకులు మరియు ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కాకినాడకు చెందిన తేజ్ కిరణ్, చందు, సింహాద్రి, అరవింద్, విగ్నేష్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్‌తో సరిహద్దులు దాటిస్తున్న ఈ ముఠాను రూరల్ సీఐ రేవతమ్మ బృందం చాకచక్యంగా పట్టుకుంది. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.






