భారీ చోరీ కేసును ఛేదించిన.. రూ.25 లక్షల బంగారం రికవరీ

by Vemula.Srinu Prasad |

విశాఖలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు...

భారీ చోరీ కేసును ఛేదించిన.. రూ.25 లక్షల బంగారం రికవరీ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భారీ చోరీ కేసు(Case)ను పోలీసులు ఛేదించారు. రూ.25 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు(Jewelry, Diamonds) స్వాధీనం చేసుకున్నారు. 20 తులాల బంగారం రికవరీ చేశారు. అంతేకాదు మరో రెండు వేర్వేరు కేసులను సైతం ఛేదించారు. ఈ కేసుల్లో ఇద్దరు మహిళలు అరెస్ట్ అయ్యారు. పెందుర్తి(Pendurthi)లో డాక్టర్ రాఘవేంద్ర(Dr. Raghavendra) ఇంట్లో కేర్ టెకర్‌గా పని చేసిన సత్యవతి చోరీకి పాల్పడుతున్నారు. రాఘవేంద్ర, ఆయన భార్య లేని సమయంలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేసిన సత్యవతి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Next Story