- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లు అరెస్ట్.. రూ. కోటి విలువైన సొత్తు స్వాధీనం
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ..

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District)లో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎర్రచందనం తరలింపుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నిక్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. దీంతో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను గుర్తించారు. లంకమల్ల అటవీ ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.కోటి విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. టన్ను ఎర్రచందనం దుంగలతో పాటు 2 వాహనాలను సీజ్ చేశారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగదస్తగిరిరెడ్డిని అరెస్టు చేశారు. నాగదస్తగిరి రెడ్డిపై 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు ఉన్నాయి. ఆయన భార్య లూలుబీపై కూడా ఎర్రచందనం కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలోని బడా స్మగ్లర్‌కు ఎర్రచందనం దుంగలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా వ్యాపారి విక్రమ్ సింగ్ సోలంకి వారం క్రితం అరెస్టు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.






