- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జిలపై దాడులు... నలుగురు మహిళలు, 15 మంది యువకుల అరెస్ట్
నెల్లూరులోని పలు హోటళ్లు, లాడ్జిలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. ..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లోని పలు హోటళ్లు(Hotels), లాడ్జి(Lodges)లపై పోలీసులు దాడులు(Police Raids) నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు(Antisocial activities) జరుగుతున్నాయన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. పలు లాడ్జిలు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నలుగురు మహిళలను, 15 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ‘‘ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏదైనా ముఠా ఉందా?’’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
విచారణ చేపట్టిన ఏఎస్పీ దీక్ష
అదుపులోకి తీసుకున్న వారిని ఏఎస్పీ దీక్ష స్వయంగా విచారిస్తున్నారు. నెల్లూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాడ్జిల నిర్వహణలో నిబంధనలు పాటించని యజమానుల లైసెన్సులు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు.






