- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా ఎర్రచందనం పట్టివేత: ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్ట్
కడప జిల్లా ఖాజీపేట మండలం చిల్లకనుమ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఎర్రచందనాన్ని గుర్తించారు....

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) ఖాజీపేట మండలం చిల్లకనుమ(Chillakanuma) వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఎర్రచందనాన్ని(Red Sandal) గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు.
మార్కెట్‌లో భారీ విలువ
అయితే పట్టుబడిన దుంగల విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






