- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ చోరీల ముఠా అరెస్ట్: 75 లక్షల బంగారం, కేజీల కొద్దీ వెండి స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కిలాడీ దొంగలను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. .

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కిలాడీ దొంగలను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.75 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, ఆరున్నర కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యజమానులు లేని సమయంలో...
అయితే వీరు ముగ్గురు ఇంటి యజమానులు లేని సమయాన్ని చూసి ఇళ్లను టార్గెట్ చేస్తారని పోలీసులు తెలిపారు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రెక్కీ నిర్వహించిన తర్వాతే వీరు అర్ధరాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడేవారని పోలీసులు తెలిపారు. అయితే వరుస ఫిర్యాదులతో ప్రత్యేక నిఘా ఉంచి ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు.. నిందితుల హిస్టరీని పరిశీలించడంతో వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.






