- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో నిందితుడు చైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో పోలీసులు దూకుడు పెంచారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడు చైతన్య(Accused Chaitanya)ను అరెస్ట్ చేశారు. పీటీఎం మండలంలోని ఆంధ్ర వైన్స్(Andhra Wines)లో చైతన్య పని చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీలో ఆయనపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో చైతన్యను పోలీసులు 22వ నిందితుడిగా పేర్కొన్నారు. తాజాగా చైతన్యను అరెస్ట్ చేశారు. అనంతరం తంబళ్లపల్లె కోర్టు(Tamballapalle)లో ప్రవేశ పెట్టారు. దీంతో చైతన్యకు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
Next Story






