అరుణ వ్యవహారంలో కూపీ లాగుతున్న పోలీసులు.. ఫోన్ వాయిస్, వీడియో రికార్డుల పరిశీలన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-22 06:21:32  IST  )

రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై పోలీసులు కూపీలాగుతున్నారు...

అరుణ వ్యవహారంలో కూపీ లాగుతున్న పోలీసులు.. ఫోన్ వాయిస్, వీడియో రికార్డుల పరిశీలన
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)కు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్(Rowdy sheeter Srikanth parole) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేగిన విషయం తెలిసిందే. అయితే తన ప్రియురాలతో కలిసి సాగించిన దందాలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రియురాలు అరుణను రిమాండ్‌లో ఉన్నారు. అయితే రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపైనా మరింతగా విచారణ జరుపుతున్నారు. శ్రీకాంత్ పెరోల్ వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరుణ ఫోన్‌లోని వాయిస్, వీడియో రికార్డులను పరిశీలిస్తున్నారు. అరుణకు సహకరించిన పోలీసులు ఎవరు అనే దానిపైనా ఆరా తీస్తున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగుతున్నారు.

Next Story