7న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం.. చర్చకు వచ్చే కీలక అంశాలివే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 03:57:35  IST  )

పోలవరం ప్రాజెక్టు అథారిటీ (Polavaram Project Authority) 17వ సమావేశం నవంబర్ 7 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కాన్ఫరెన్స్ హాల్‌లో PPA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆధికారి అధ్యక్షతన జరగనుంది.

7న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం.. చర్చకు వచ్చే కీలక అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (Polavaram Project Authority) 17వ సమావేశం నవంబర్ 7 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కాన్ఫరెన్స్ హాల్‌లో PPA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆధికారి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నీటిపారుదల శాఖల అధికారులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు భేటీకి సంబంధించి అజెండాను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎం.రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి, 2025-26 వర్కింగ్ సీజన్ యాక్షన్ ప్లాన్‌పై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ (WRD) అధికారులు ప్రస్తుత సీజన్‌లో చేపట్టే కార్యక్రమాల టైమ్‌లైన్స్ వారీగా వివరించనున్నారు.

లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధిత ప్యాకేజీలు పురోగతి, తాజా పరిస్థితులపై చర్చించున్నారు. కన్స్ట్రక్షన్ స్టేజ్ కోసం త్రిసభ్య కమిటీ రూపొందించిన ఎంవోను ఆమోదించనున్నారు. CAG ఆడిట్ ఆబ్జెక్షన్స్ నేపథ్యంలో 41.15 మీటర్ల నీటి నిల్వకు సంబంధించి మార్పులు చేర్పులు చేసి కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెడ్‌క్వార్టర్స్‌ను రాజమండ్రి (బొమ్మూరు)కు షిఫ్ట్ చేసే అంశంపై కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోనన్నారు. ఇప్పటికే CE (P&D) ఆఫీసు రాజమండ్రి నుంచి పనిచేస్తుండగా.. ఆ కార్యాలయాన్ని భవిష్యత్తులో అమరావతికి తరలించే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ దశలో 27 పోస్టులు (18 రెగ్యులర్ + 9 అవుట్‌సోర్సింగ్) నియామకాలకు ఆమోదం తెలుపనున్నారు. 2023-24, 2024-25 ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులపై చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణతో ఇంటర్‌స్టేట్ ఇష్యూస్, సబ్‌మర్జెన్స్, డ్రైనేజ్ కంజెస్టన్, భద్రాచలం-మణుగూరు ప్రొటెక్షన్, మొత్తం 6 స్ట్రీమ్స్ స్టడీస్‌పై ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు.

Next Story