PM Tour: ప్రధాని పర్యటన.. నేడు కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

by Kema Shiva Kumar |

రాజధాని అమరావతి (Amaravati)లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) మే 2న రాష్ట్రానికి రానున్నారు.

PM Tour: ప్రధాని పర్యటన.. నేడు కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati)లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) మే 2న రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలనే పీఎం టూర్ ఏర్పాట్లను నిత్యం సమీక్షించేందుకు మొత్తం ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ (Cabinet Sub-Committe)ని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ (AP Government) ఉత్తర్వులను జారీ చేసింది. ఆ కమిటీలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు. అయితే, ప్రధాని పర్యటనపై ఏర్పాట్లకు ఇవాళ సబ్ కమిటీ మొదటి సారి భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధాని బహిరంగ సభ, హెలిప్యాడ్, రోడ్ షోల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు.

Next Story