- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగులో మాట్లాడిన ప్రధాని మోడీ.. మురిసిపోయిన సీఎం చంద్రబాబు
"అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి" అని తెలుగులో మాట్లాడటంతో.. సీఎం చంద్రబాబు మురిసిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి పునర్నిర్మాణ పనులకు (Amaravati Restart) ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) శంకుస్థాపనలు చేశారు. రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు, మరో రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని వేదికపై నుంచే శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఒక పుణ్యభూమి అని, అలాంటి పుణ్యభూమిపై తాను నిలబడి ఉండటం, దుర్గా భవానీ కొలువైన భూమిలో అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్న ఒక స్వప్నం సాకారమవుతుందన్న విషయం కళ్ల ముందు కనిపిస్తోందని, ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందన్నారు. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదని, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ (Vikasit Bharat)కు నిరదర్శనాలని కొనియాడారు. రికార్డువేగంతో అమరావతికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తెలుగులో ప్రసంగించారు. "అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక్ ప్రదేశ్‌గా, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి" అని తెలుగులో మాట్లాడటంతో.. సీఎం చంద్రబాబు మురిసిపోయారు. మోడీ మాటలకు చంద్రబాబు మనస్ఫూర్తిగా నవ్వుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






