Amaravati:‘జుట్టు ఊడుతోంది ఏంటి?’.. ఏపీ మంత్రిని పలకరించిన ప్రధాని మోడీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-02 15:04:06  IST  )

ప్రధాని మోడీ అమరావతి(Amarawati) పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Amaravati:‘జుట్టు ఊడుతోంది ఏంటి?’.. ఏపీ మంత్రిని పలకరించిన ప్రధాని మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ అమరావతి(Amarawati) పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీలో ఇవాళ(శుక్రవారం) పీఎం మోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ఫున:శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ(PM Narendra Modi) ఈ రోజు ఏపీ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రధాని మోడీ ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ తరుణంలో ప్రధానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan Kalyan), పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.

ఈ క్రమంలో ప్రధాని మోడీని సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయితే.. సభా వేదిక ఎక్కుతుండగా ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya Kumar Yadav) తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయనను పలకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? జుట్టు ఊడుతోంది ఏంటి?’ అని కుశల ప్రశ్నలు వేశారు. దీంతో ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఒత్తిడితో పాటు విజయవాడ నీళ్ల మహత్యం సార్ అంటూ మంత్రి సత్య కుమార్ యాదవ్ సరదాగా సమాధానం చెప్పారు.

Next Story