Yoga Day 2025: యోగా డే ఏర్పాట్లపై ప్రధాని ఆరా

by Naga Rani Yarlagadda |

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఏపీ ప్రభుత్వం యోగా డే సెలబ్రేషన్స్ (Yoga Day Celebrations in AP) నిర్వహించనుంది.

Yoga Day 2025: యోగా డే ఏర్పాట్లపై ప్రధాని ఆరా
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఏపీ ప్రభుత్వం యోగా డే సెలబ్రేషన్స్ (Yoga Day Celebrations in AP) నిర్వహించనుంది. ఈ ఏర్పాట్ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానిని కలిసి, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో సంబంధం ఉన్న నాలుగు దేశాల పర్యటనకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో యోగా డే గురించి కూడా చర్చ జరిగింది.

లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishna Devarayalu) తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ, "మంత్రి లోకేశ్‌(Minister Lokesh) యోగా డే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. గిన్నిస్‌ బుక్‌ రికార్డు (Guinness book of Records) సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విన్నాను. ఈ విషయంలో లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం" అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం చేస్తున్న ప్రత్యేక చొరవను ప్రధాని ప్రశంసించారని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమం విజయవంతానికి సన్నద్ధమవుతున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానికి వివరించినట్టు తెలిపారు.

Next Story