- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు అలర్ట్.. ఖాతాల్లో జమకాని పీఎం కిసాన్ డబ్బులు.. కారణం ఇదేనా?
పీఎం కిసాన్ డబ్బుల గురించి రైతన్నలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ డబ్బుల గురించి రైతన్నలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 20వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయా? అని రైతులు పడిగాపులు కాస్తున్నారు. మొదటగా ఈ నెల(జులై) 18 నాటికి ఈ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఆ డబ్బులు రైతుల అకౌంట్లోకి చేరలేదు. దీంతో అసలు డబ్బులు వస్తున్నాయా? లేదా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు విడుదల చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. నిన్న(శుక్రవారం) బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారని అంతా భావించినా అలా జరగలేదు. అయితే జూలై నెలాఖరులో కానీ.. ఆగస్టు నెల మొదటి వారంలో కానీ పీఎం కిసాన్ డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అంటున్నారు. ఇకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు ఆలస్యంగా పడటానికి కారణం రైతుల డేటాను సరి చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల డేటా కరెక్ట్‌గా ఉండేలా చూసుకొని.. డబ్బులు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హులైన ప్రతి రైతుకు ఈ డబ్బులు అందించాలని తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.






