- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్లీజ్ నన్ను అలా పిలవద్దు’.. నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ఈరోజు(శుక్రవారం) తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా(Krishna district) కొమరువోలు గ్రామం(Komaravolu Village)లో పర్యటించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ఈరోజు(శుక్రవారం) తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా(Krishna district) కొమరువోలు గ్రామం(Komaravolu Village)లో పర్యటించారు. ఈ క్రమంలో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తనను మేడమ్ అని పిలవద్దని, నేను మీ భువనమ్మను’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొమరవోలుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని తాను ఎప్పుడు మర్చిపోను అన్నారు. ఈ తరుణంలో గ్రామస్తులందరూ ఐక్యమత్యంగా.. ఒక కుటుంబం మాదిరి కలిసి ఉండాలని ఆమె కోరారు. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం(AP Government) వచ్చాక రోడ్ల మరమ్మతుల పై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు.






