Tirumala Temple : తిరుమల శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం చక్కర్లు !

by Y. Venkata Narasimha Reddy |

తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)పై మరోసారి(Once Again) ఓ విమానం(Plane) చక్కర్లు కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో టీటీడీ(TTD) విజిలెన్స్ టీమ్ అప్రమత్తమైంది. వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్ పోర్టు అధికారులను కోరింది

Tirumala Temple : తిరుమల శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం చక్కర్లు !
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)పై మరోసారి(Once Again) ఓ విమానం(Plane) చక్కర్లు కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో టీటీడీ(TTD) విజిలెన్స్ టీమ్ అప్రమత్తమైంది. వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్ పోర్టు అధికారులను కోరింది. ఆలయం పైనుంచి డ్రోన్లు, విమానాలు ఎరగకూడదని తెలిసినా.. ఈ విమానం ఎలా వెళ్లిందన్న దానిపై టీటీడీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం(Prohibition). టీటీడీ ఎన్నోసార్లు దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పటికి కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు.

దీంతో పదేపదే శ్రీవారి ఆలయం మీదుగా విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఆగమ పండితులు శ్రీవారి ఆలయ ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం నియామాలకు విరుద్ధంగా విమానాలు ఎగరడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతేడాది జూన్ 7న, అక్టోబర్ 21న ఒకసారి.. తాజాగా జనవరి 2న కూడా తిరుమల ఆలయం మీదుగా విమానం వెళ్లింది. ఇలా విమానాలు, హెలికాప్టర్‌లు వెళ్లిన ప్రతిసారి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆరా తీస్తోంది. తిరుమల కొండలను నో ఫ్లయింగ్ జోన్(No-fly zone)గా ప్రకటించాలని కోరతూ టీటీడీ గతంలో పలు పర్యాయాలు కేంద్రానికి విన్నవించింది.

అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఈ దిశగా చర్యలు వెలువడలేదు. తరచూ విమనాలు, హెలికాప్టర్ తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి వెళుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర విమానాయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో.. ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అంటున్నారు.

Next Story