- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు.. పార్టీ జెండా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
పిఠాపురం జనసేనకు మరింత బలం పెరిగింది....

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం జనసేన(Pithapuram janasenaకు మరింత బలం పెరిగింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలోని కీలక నేతలంతా పవన్ వెంట నడుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది జనసేనలో చేరగా మరికొందరు కూడా సిద్ధంగా ఉన్నారు.
తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత కూడా జనసేన గూటికి చేరిపోయారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. దొరబాబుతో పాటు పలువురు కీలక నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో దొరబాబు వైసీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో పిఠాపురంలో మొత్తం సీన్ మారిపోయింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
దీంతో పిఠాపురం నియోజకర్గం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది. పవన్ ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎం పదవి చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. దీంతో చోటా మోటా నేతలంతా జనసేనలో చేరుతున్నారు. మరోవైపు కూటమి నేతలంతా పవన్ కల్యాణ్‌కు సహకరిస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలం కొండంతగా పెరిగింది.






