- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టీల్‌ప్లాంట్ రోడ్డులో పేలిన పైప్‍లైన్.. కార్మికుడు మృతి
కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో ఉన్న స్టీల్ ప్లాంట్ రోడ్డులో పైప్ లైన్ పనుల్లో విషాద ఘటన జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక స్టీల్‌ప్లాంట్ రోడ్డు సమీపంలో పైపులైన్ పనుల కోసం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ ఒక వలస కార్మికుడి ప్రాణాలను బలితీసుకుంది. జైరాజ్ ఇస్పాత్ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన పురేందర్ అనే కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. పైపులైన్ పనుల కోసం భూమిని పేల్చే క్రమంలో జరిగిన ఈ పేలుడు తీవ్రత వల్ల కార్మికుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతం నుండి వచ్చిన వలస కార్మికుడు ఇలా పని ప్రదేశంలోనే మృత్యువాత పడటం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.






