జంట హత్యల కేసులో బెయిల్.. జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు..

జంట హత్యల కేసులో బెయిల్.. జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జంట హత్యలు(Double Murder) జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రిమాండ్ ‌ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Former Macherla MLA Pinnelli Ramakrishna Reddy) సోదరుడు వెంకట్రామిరెడ్డికి గురువారం బెయిల్ మంజూరు అయింది. దీంతో శుక్రవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా (A-6) ఉన్న ఆయనకు కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

జైలు ద్వారం వద్ద పూల వర్షం

అయితే వెంకట్రామిరెడ్డి విడుదల నేపథ్యంలో గుంటూరు జైలు వద్ద భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జైలు ద్వారం వద్ద ఆయన బయటకు రాగానే పూల వర్షం కురిపించారు. వెంకట్రామిరెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కాగా రాష్ట్రంలో కొంతకాలంగా జంట హత్యల కేసు రాజకీయంగా పెను దుమారం రేపింది. పిన్నెల్లి సోదరుల అరెస్టులు మాచర్ల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి బెయిల్ లభించి విడుదలవ్వడంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది.

Next Story