- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
99 రోజుల తర్వాత.. సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదల : నెల్లూరులో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, దాదాపు 99 రోజుల జైలు వాసం తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్ద పిన్నెల్లికి పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అక్రమ కేసులతో వేధించారు : పిన్నెల్లి ధ్వజం
జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. ‘వెల్దుర్తి మండలంలో టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో చోటుచేసుకున్న హత్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాటి ఎస్పీ సైతం ఇది ఇరువర్గాల మధ్య జరిగిన గొడవగా స్పష్టం చేసినా, ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. 99 రోజులు జైల్లో పెట్టి నన్ను మానసిక క్షోభకు గురిచేశారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని, అక్రమ కేసుల వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని పిన్నెల్లి హెచ్చరించారు. దీని వెనుక ఉన్న రాజకీయ నాయకులు, అధికారులను ఎవరినీ వదిలిపెట్టం.. ప్రతి దానికి జవాబు చెప్పాల్సిన సమయం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గత ఏడాది మే నెలలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన సోదరులు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆరో నిందితుడిగా (A6), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏడో నిందితుడిగా (A7) పోలీసులు చేర్చారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి అరెస్ట్ కాగా, బుధవారం గురజాల 10వ అదనపు కోర్టు జడ్జి ప్రియదర్శిని ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.






