- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు, రేపు విశాఖలో పీసా మహోత్సవ్
పీసా 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని..

దిశ, వెబ్‌డెస్క్: పీసా 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. విశాఖ వేదికగా నేడు, రేపు పీసా మహోత్సవ్ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మహోత్సవ్ కు 10 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు విచ్చేయనున్నారు. కబడ్డీ, ఆర్చరీ పోటీలతో పాటు.. గిరిజన సంస్కృతులు, సంప్రదాయాలతో ప్రదర్శనలు ఉండనున్నాయి. ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం ఉదయం 6 గంటలకు 10కె పీసా రన్ ప్రారంభమైంది. 9 గంటలకు పోర్టు ఇండోర్ స్టేడియంలో కబడ్డీ మ్యాచ్ లు, 10 గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్లకు ఆర్చరీ పోటీలను అధికారులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి క్రీడాకారులు, అధికారులు, గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడాపోటీలు జరుగుతాయి.
రేప ఉదయం 11 గటల నుంచి స్థానిక కళావాణి స్టేడియంలో వివిధ రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. రెండ్రోజుల పీసా మహోత్సవ్ లో గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.






