- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ పాడవ్వకపోతే చాలు: మంత్రుల టూర్‌పై పేర్ని నాని సెటైర్లు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రాభివృద్ధి ఏమో కానీ సింగపూర్ పాడవ్వకపోతే చాలని ఏపీ మంత్రుల బృందం పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధి ఏమో కానీ సింగపూర్(Singapur) పాడవ్వకపోతే చాలని ఏపీ మంత్రుల(Ap Ministers) బృందం పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani) సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌లో అధ్యయనం చేసేందుకు మంత్రులు ఆరు రోజులుగా పర్యటనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనపై పేర్ని నాని విమర్శలు కురిపించారు. సాగు లేని చోటకు వ్యవసాయి మంత్రి వెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచుకున్నది దాచుకోవడానికే మంత్రుల సింగపూర్ పర్యటన అని వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలనకు సింగపూర్ ప్రసిద్ధి అని, గతంలో చంద్రబాబు(Chandrababu)ను కలిసిన సింగపూర్ మంత్రి జైలు పాలయ్యారని పేర్ని నాని విమర్శించారు.
Next Story






