రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబుకు పేర్ని నాని కీలక సలహా

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. దీంతో వాహనదారులు ఆయిల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు...

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబుకు పేర్ని నాని కీలక సలహా
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) కొరత కొనసాగుతోంది. దీంతో వాహనదారులు(Motorists) ఆయిల్ బంకుల(Oil Stations) వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడి పెట్రోల్, డీజిల్ పోయించుకుని వెళ్తున్నారు. అయితే ఓ వైపు ఎండ, మరోవైపు ఆయిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు.

సీఎం చంద్రబాబుపై పేర్ని నాని విమర్శలు

ఇదే విషయంపై తాజాగా సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani) విమర్శలు కురిపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోల్, డీజిల్ కష్టాలని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని వాడాలని సూచించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేరా అని ప్రశ్నించారు. తమ పలుకుబడిని ఉపయోగించి సమస్యను పరిష్కరించాలని సలహా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయిందని ఆరోపించారు. 2047 వరకూ ఏదో చేస్తామంటే అప్పటిదాకా ఎవరి బతికుంటారో తెలియదని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Next Story