- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రకటన పచ్చి మోసం: ప్రభుత్వంపై పేర్ని నాని సెన్సేషనల్ కామెంట్స్
మామిడి రైతులకు ప్రకటించిన సబ్సిడీ పడటం లేదని ఏపీ ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: తోతాపురి మామిడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 4 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఇప్పటి వరకూ పడలేదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడంలేదని విమర్శించారు. జగన్ వెళ్లే వరకు మామిడి రైతులను పట్టించుకోలేదన్నారు. జగన్ వెళ్లడం వల్లే కిలో మామిడి రూ.6కి కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 రూపాయలు కాదు 4 పైసలు వేయలేదని చెప్పారు. రూ.4 సబ్సిడీ ప్రకటన పచ్చి మోసమని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు.
కాగా చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతులు తీవ్ర నష్టాలతో అల్లాడిపోతున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఏం చేయాలో తోచక ఆయోమయ స్థితిలో పడ్డారు. దీంతో ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. మామిడి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా మామిడికి రూ. 4 ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.
అయితే మామాడి రైతులను మాజీ సీఎం జగన్ పరామర్శించేందుకు జగన్ బంగారుపాళ్యం వెళ్లారు. కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు లేకుండా భారీగా జనాన్ని సమీకరించారు. దీంతో భద్రత కోసం పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.ఈ సమయంలో వైసీపీకి చెందిన కొందరికి, పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సైతం స్పందించారు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీపై విమర్శలు కురిపించారు.






