సభకు పర్మిషన్ ఇవ్వకపోతే పవన్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు: పేర్ని నాని

by Ajay Maddhiboyina |

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పేర్నినాని కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేవ‌న్నీ సొల్లు క‌బుర్లే అంటూ ఎద్దేవా చేశారు. త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌న్న ప‌వ‌న్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్ర‌శ్నించలేద‌ని అడిగారు.

సభకు పర్మిషన్ ఇవ్వకపోతే పవన్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు: పేర్ని నాని
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పేర్నినాని కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేవ‌న్నీ సొల్లు క‌బుర్లే అంటూ ఎద్దేవా చేశారు. త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌న్న ప‌వ‌న్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్ర‌శ్నించలేద‌ని అడిగారు. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే ప్ర‌శ్నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ యూట్యూబ‌ర్లు, రిపోర్ట‌ర్ల కోసం ప్రెస్ మీట్ పెట్టారా అని అడిగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఎస్ఆర్ ను ఎదిరించా అని చెప్పుకుంటున్నాడ‌ని ఆయ‌న‌ చెప్పేవి అన్నీ సొల్గు క‌బుర్లేన‌ని మండిపడ్డారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో మీటింగ్ పెట్ట‌లేడు కానీ తెలంగాణ‌లో పెడ‌తాడట.. సూప‌ర్ సిక్స్ పై ప్ర‌శ్నిస్తాడ‌ట అని ఎద్దేవా చేశారు. త‌ల్లికి కూడుపెట్ట‌లేనోడు పిన‌త‌ల్లికి ప‌ట్టుచీర పెడ‌తాడ‌ట అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలోపై అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో నేత‌లు స్పందిస్తున్నారు. తెలంగాణ ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, కాంగ్రెస్ నాయ‌కులు ప‌వ‌న్ కామెంట్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ సైతం ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.

Next Story