రప్పా.. రప్పా.. సినిమా డైలాగులు వద్దు అని చెప్పా: పేర్నినాని

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-12 17:14:28  IST  )

మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా జిల్లాలో నిర్వ‌హించిన బాబు షూరిటీ మోసం కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే.

రప్పా.. రప్పా.. సినిమా డైలాగులు వద్దు అని చెప్పా: పేర్నినాని
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా జిల్లాలో నిర్వ‌హించిన బాబు షూరిటీ మోసం కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు ర‌ప్పా ర‌ప్పా అంటున్నారు. ఏదైనా చేయాలంటే చీక‌ట్లో క‌న్నుకొడితే అయిపోవాలి త‌ప్ప ర‌ప్పా ర‌ప్పా అని అన‌డం కాద‌న్నారు. కాగా ఆయ‌న వ్యాఖ్య‌లు రెచ్చగొట్టేలా ఉన్నాయ‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్ లో సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో నాని త‌న వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి మీడియాతో మాట్లాడారు.

త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను సినిమా డైలాగులు మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల మ‌న‌సును గెలుచుకోవాల‌ని చెప్పాన‌ని అన్నారు. వాళ్ల లాగా అధికారం ఇవ్వండి ఎర్ర‌బుక్కు రాసుకుంటాం, వాళ్ల‌ని జైల్లో వేస్తాను, వీళ్ల‌ను జైల్లో వేస్తాను లాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌తో కాకుండా, సైకో ఆలోచ‌న‌ల‌తో కాకుండా మంచి ఆలోచ‌నల‌తో ఉండాల‌ని చెప్పా అన్నారు. ఇలాంటి సైకో ఆలోచ‌న‌ల‌తో ఉండ‌కూడ‌ద‌ని చెప్పాన‌ని అన్నారు. న‌రికేయ‌మ‌ని తాను చెప్ప‌లేద‌ని కావాలంటే వీడియోలు చూసుకోవాల‌న్నారు. నాలుగు రోజుల క్రితం మాట్లాడిన మాటల‌ను వాళ్ల మీడియాలో ఎడిట్ చేసి ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆరోపించారు.

Next Story