- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ మాట అసెంబ్లీలో చెప్పే దమ్ముందా..?: చంద్రబాబు, లోకేశ్‌కు పేర్ని నాని సవాల్

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం(Telugu Desam), జనసేన(Janasena), బీజేపీ(Bjp) కలిసి వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf Amendment Act) ఆమోదించాయని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో చెప్పే దమ్ముందా అని చంద్రబాబు, లోకేశ్‌కు పేర్ని నాని సవాల్ విసిరారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో కేసు వేయగలరా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ(Endowment Department)లో హిందూయేతరుల అధికారులను పెట్టడం లేదని, మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారని నిలదీశారు. ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలనా పాలనకు ముస్లిమేతరులను పెట్టడం సమబేనా అని పేర్ని నాని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం బిల్లు పార్లమెంట్‌లో పాసయ్యేది కాదన్నారు. వక్ఫ్ చట్టాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యతిరేకిస్తే ప్రధాని మోడీ(Pm Modi) ఈ చట్టాన్ని తెచ్చేవారు కాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.