- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో బాలయ్య వివాదం: ఓటుకు నోటు కేసుపై పేర్ని నాని మళ్లీ సంచలన వ్యాఖ్యలు
ఓటు నోటు కేసుపై పేర్ని నాని మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ysp Chief Jagan Mohan Reddy) సైకో అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perninani) ఓ చానల్ డిబేట్‌లో మాట్లాడుతూ నిర్మాతపై బాలయ్య జరిపిన కాల్పుల ఘటన గుర్తు చేశారు. డాక్టర్లను మేనేజ్ చేసి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని తెలిపారు. నారా, నందమూరి ఫ్యామిలీలు ప్రాథేయపడటంతోనే బాలకృష్ణను ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) వదrలేశారని చెప్పారు. అలాగే చంద్రబాబును మాజీ సీఎం కేసీఆర్(Former Cm Kcr) కూడా వదిలేశారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబును కేసీఆర్ ఏం చేయలేదని తెలిపారు. కేసీఆర్, వైఎస్ వల్లే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, నిర్మాతపై కాల్పుల ఘటనలో బాలకృష్ణ బయటపడ్డారని పేర్ని నాని పేర్కొన్నారు.






