- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం : పవన్ కళ్యాణ్
ఉప్పాడ(Uppada) ప్రాంతంలోని పిఠాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న తీరప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉప్పాడ(Uppada) ప్రాంతంలోని పిఠాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న తీరప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDMA) ద్వారా కేంద్ర ప్రభుత్వం ₹323 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ నిర్మాణాలు చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోందన్నారు. ఉప్పాడ తీరప్రాంతంలో గత ఐదు సంవత్సరాలలోనే సగటున సంవత్సరానికి 1.23 మీటర్ల తీరప్రాంతం కోతకు గురైంది. దీనివల్ల సుమారు 12 మీటర్ల తీరం కోల్పోయింది. ఇది సమీప గ్రామాలపై, ముఖ్యంగా చేపల వేట వృత్తిపై ఆధారపడిన వారి గృహాలపై తీవ్ర ప్రభావం చూపింది.
తాము ఇచ్చిన ఎన్నికల హామీకు కట్టుబడి, అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే NDMA ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కాకినాడ ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.






