అప్పులఅప్పారావు బుగ్గనతో ఆవు కథలు చెప్పిస్తే ప్రజలు నమ్మరు: అచ్చెన్నాయుడు

by Dishaweb |
అప్పులఅప్పారావు బుగ్గనతో ఆవు కథలు చెప్పిస్తే ప్రజలు నమ్మరు: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని కాపాడటానికే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. కాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని సవాల్ విసిరారు. 18సార్లు సీఎం ఢిల్లీ వెళ్తే.. మొదట్లో ఏంచెప్పారో, ఇప్పుడు అదేచెబుతున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతికాప్రకటనలో అక్షరం మారలేదు అని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి జగన్ రాష్ట్రానికి ఏంసాధించాడో ఆయనే చెప్పాలని అంతేకానీ అప్పుల అప్పారావు అయిన మంత్రి బుగ్గనతో ఆవుకథలు చెప్పిస్తే ప్రజలు నమ్మరు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఏపనిమీద ఢిల్లీవెళ్తే మీకెందుకు అని అప్పులఅప్పారావు ప్రశ్నించడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంకోసం, ప్రజలకోసం జగన్ ఢిల్లీవెళ్తే ఆ విషయం చెప్పడానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటనల అన్నీ తనకేసులు మాఫీకోసం.. వివేకానందరెడ్డి హత్యకేసు నుంచి బయటపడటానికేనని ఆరోపించారు. వివేకాను చంపింది ఎంపీ అవినాశ్ రెడ్డేనని, సాక్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టబోతున్న తరుణంలో, అవినాశ్‌ను అరెస్ట్ చేస్తారని తేలిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన ఎవరికైనా అనుమానాలురేకెత్తిస్తుంది అని చెప్పుకొచ్చారు. తమ్ముడిని కాపాడటానికే ముఖ్యమంత్రి, ప్రధాని మోడీని కలిశారని రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారని దీనికి సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని అచ్చెన్నాయుడు నిలదీశారు.

Also Read..

Ap News: టీడీపీకి భారీ షాక్ .. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే పసలNext Story