48 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. జనం విలవిల..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-21 10:28:26  IST  )

ఎండ దెబ్బకు రాష్ట్రంలో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం నుంచి భానుడు భగ్గుమంటున్నారు. దెబ్బతో జనం ఇంటి నుంచి బయటకు రావడానికి జంకిపోతున్నారు. ..

48 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. జనం విలవిల..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎండ దెబ్బకు రాష్ట్రంలో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం నుంచి భానుడు భగ్గుమంటున్నారు. దెబ్బతో జనం ఇంటి నుంచి బయటకు రావడానికి జంకిపోతున్నారు. మే రెండు వారాలు కొంత పర్వాలేదనిపించినా మూడు వారంలో మాత్రం మాడు మండిపోతోంది. బయటకు వస్తే చాలు నెత్తి సుర్రుమంటోంది. రెండు రోజులుగా ఎండలు మరింత విపరీతంగా ఉన్నాయి. 48 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతం మండిపోతోంది. కనిగిరిలో ఈ రోజు 48.03 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.97 డిగ్రీలు, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడులో 47.38 డిగ్రీలు, కంచికచర్లలో 46.71 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా బాపట్ల, ఏలూరు, మార్కాపురంలోనూ భారీగా టెంపరేచర్ పెరిగింది. మరో నాలుగు రోజుల పాటు ఎండలు మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు వైద్య శాఖ సూచించింది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరియు ఎండలో పనిచేసే కూలీలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరించారు.

Next Story