- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. విషయమేంటంటే?
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలకు(Development Programs) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఏలూరు జిల్లా(Eluru District)లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల రెండు రోజులు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి ఆ సమయంలోనే మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అయితే.. మంత్రి పర్యటనలో భాగంగా ఈ నెల(ఏప్రిల్)23వ తేదీన బుట్టాయగూడెం మండలం పులిరాముడిగూడెం ప్రజలు తమకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ తరుణంలో మంత్రి నాదెండ్ల తాగునీటి సమస్య పై వెంటనే స్పందించారు. ఆ ప్రాంతంలోని గిరిజనుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. అంతవరకూ ట్యాంకర్ల ద్వారా త్రాగు నీరు సరఫరా చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని, RWS అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు రక్షిత తాగునీటిని ప్రతీరోజు ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామ పంచాయతీలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 2.50 లక్షలు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం.. తక్షణమే తమ సమస్యను పరిష్కరించడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






