- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భానుడి విశ్వరూపం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల దెబ్బలకు జనం దడదడలాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావలంటేనే జంకిపోతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల దెబ్బలకు జనం దడదడలాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావలంటేనే జంకిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటేశాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాడ్పులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా(Palnadu District) పిడుగురాళ్ల(Piduguralla)లో గరిష్టంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
చాలా ప్రాంతాల్లో ..
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది.ఈ తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల ప్రభావం మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ తీవ్ర ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌లోనే అత్యధిక రికార్డుగా నిలిచింది.






