- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన దారిలోనే నడుస్తా: పెంచలయ్య భార్య సంచలన స్టేట్‌మెంట్
తన భర్త నడిచిన బాటలోనే తాను నడుస్తానని పెంచలయ్య భార్య దుర్గ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో గంజాయి(Ganga) బ్యాచ్ దాడిలో మృతి చెందిన సీపీఐ నేత పెంచలయ్య(CPI leader Penchaliah) భార్య దుర్గ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త బాటలోనే తాను నడుస్తానని ఆమె ప్రకటించారు. తన భర్త ఐటీఐ చదువుకున్నారని, పిల్లలను బాగా చదివించాలనుకున్నారని తెలిపారు. ఆర్టీడీ కాలనీలో అరాచకాలు ఎక్కువయ్యాయని, ఇక్కడ వాళ్లమని చెప్పుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయిపై వ్యక్తిగతంగా తన భర్త చెప్పినప్పటికీ దందా కొనసాగిందన్నారు. గంజాయి రహితంగా నెల్లూరును మార్చుదామంటూ ఎసై, సీఐలు బోర్డులు కూడా ఏర్పాటు చేశారని దుర్గ పేర్కొన్నారు. స్థానిక గుడికి చెందిన డబ్బులను కామాక్షి తినేసిందని ఆమె ఆరోపించారు. గంజాయిపై మార్పు తీసుకురావాలని పోరాటం చేసి కామాక్షి గ్యాంగ్ చేతిలో తన భర్త దారుణ హత్యకు గురయ్యారని దుర్గ ఆవేదన వ్యక్తం చేశారు.






