- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాత్రూమ్లలోకి తొంగిచూస్తున్నారు..
బాత్రూమ్లోకి కొందరు తొంగి చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో : బాత్రూమ్లోకి కొందరు తొంగి చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం రేపింది. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు తమ బాత్రూములలోకి తొంగి చూస్తున్నారంటూ ఆరోపించారు. తాము కేకలు వేయడంతో పారిపోయారని చెబుతున్నారు. వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కొద్ది రోజుల కిందట ఇటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణి కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. తిరిగి అటువంటి ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు రక్షణ కరువవుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.






