- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పచ్చి పాలు తాగొద్దు.. చాలా ప్రమాదకరం..!
పచ్చి పాలు తాగొద్దని, చాలా ప్రమాదకరమని, సూక్మ క్రిములు ఉంటాయని, పాశ్చరైజ్ అయితేనే తాగాలని పీడియాట్రీషియన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: పచ్చి పాలు(Raw Milk) తాగొద్దని, చాలా ప్రమాదకరమని పీడియాట్రీషియన్ డాక్టర్ శ్రీకాంత్(Pediatrician Dr. Srikanth) తెలిపారు. ఓ చానెల్ డిబెట్‌లో పాల్గొన్న ఆయన కల్తీ పాల ఘటనలపై స్పందించారు. ఏ పాలు అయినా సరే పచ్చిగా తాగటం గాని, పాశ్చరైజ్(Pasteurize) చేయకుండా అసలు ముట్టుకోవద్దని ఆయన తెలిపారు. పచ్చి పాలల్లో సూక్ష్మ క్రిములు(Microorganisms) ఉంటాయని తెలిపారు. ఇళ్లలో బర్రెల నుంచి తీసిన పాలల్లోనూ సూక్ష్మి క్రిములు ఉంటాయని, అందువల్ల వేడి చేసుకుని తాగాలని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు.
బర్రె పొదుగులోనూ సూక్ష్మ క్రిములు
పాలు తీసే సమయంలో చేతులు తగులుతాయని, లేదా బర్రె పొదుగులోనూ బయట సూక్ష్మ క్రిములు ఉంటాయని, పాశ్చరైజ్ చేయకుండా ఎవరూ కూడా తాగొద్దని శ్రీకాంత్ పేర్కొన్నారు. పచ్చి పాలు తాగితే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇంట్లో బర్రె నుంచి తీసిన పాలైతే వేడి చేసుకుని, డెయిరీ నుంచి అయితే పాశ్చరైజ్ చేసిన తర్వాతే తాగాలని చెప్పారు. ఇంట్లో పాశ్చరైజ్ చేయలేము కాబట్టే వేడిచేయమని చెబుతున్నామని పేర్కొన్నారు. పాశ్చరైజ్ చేయడం వల్ల పాలల్లో ఉన్న సూక్ష్మ క్రిములను నివారించగలుతామని డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు.






