బనకచర్లపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ !

by velandi.Saikiran |

ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla ) చుట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొనసాగుతున్నాయి. బనకచర్ల

బనకచర్లపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla ) చుట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొనసాగుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుంటే... ఎలాగైనా కట్టాలని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పై తాజాగా వైసీపీ పార్టీ స్పందించింది. ఈ బనకచర్ల పేరుతో చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ పార్టీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu ) అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులేనని చురకలు అంటించారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప బనకచర్ల ప్రాజెక్టుపై.. సీఎం చంద్రబాబు నాయుడుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కావాలనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుపై... నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైసిపి పార్టీ హయాంలోనే... ఏపీలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీలో దారుణాలకు ఒడిగడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా... బనకచర్ల ఎపిసోడ్ తెరపైకి తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది ఇలా ఉండగా... ఏపీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి బడా లీడర్లు అందరు ఓడిపోయిన... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మాత్రం విజయం సాధించారు.

Next Story