- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ రాజధాని కడితే.. రాయలసీమ అభివృద్ది ఎలా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే మూడు పంటలు పండే భూముల్లో రాజధానిని నిర్మిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు...

X
దిశ, వెబ్ డెస్క్: 2027లో జమిలి ఎన్నికలు(Jamili Elections) వస్తాయని, జగన్(Jagan)ను మళ్లీ సీఎంను చేయాలని వైసీపీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Rama Chandrareddy) అన్నారు. చిత్తూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే మూడు పంటలు పండే భూముల్లో రాజధానిని నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ రాజధాని కట్టడం తప్పేనని తెలిపారు. వేల కోట్లు అమరావతిలోనే పెడితే రాయలసీమ(Rayalaseema) ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందాలన్నారు. రాయలసీమ వెనుక బడిన ప్రాంతమని చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 100, 200 ఎకరాల్లోనే రాజధాని ఉందని వ్యాఖ్యానించారు. రాజధానిని కట్టేందుకు అన్ని వేల ఎకరాలు అవసరం లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story






