- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడిపర్తికి బయలు దేరిన పెద్దారెడ్డి.. టెన్షన్..టెన్షన్
అనంతపురం జిల్లా తాడిపర్తిలో హై అలర్ట్నెలకొంది.

హైకోర్టు ఆదేశాలతో బయలుదేరిన పెద్దారెడ్డి
నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు
ఎర్రగుంటపల్లి వద్ద జేసీ ప్రభాకరరెడ్డి
ఏం జరుగుతుందో అని అంతటా టెన్షన్
దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లా తాడిపర్తిలో హై అలర్ట్నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపర్తి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు భద్రత కల్పించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బృందం ఆద్వర్యం లో ఈ ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. దాదాపు 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్వద్ద జేసీ ప్రభాకరరెడ్డి శివుడి విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు. అప్పుడే పెద్దారెడ్డి బయలుదేరడంతో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఏం జరుగుతుందో అని స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వైసిపి నేత పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎస్పీతో పెద్దిరెడ్డి వాగ్వాదానికి దిగాడు. తాడి పత్రికి వెళ్లేందుకు తనకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న కూడా పోలీసులు అడ్డుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. అంతా జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతోందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని మండిపడ్డారు.
వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 18న తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10-11 గంటల మధ్యలో ఇంటికెళ్లాలని పెద్దారెడ్డికి స్పష్టం చేసింది. అనుచరులను రెచ్చగొట్టొద్దని, కాన్వాయ్‌లో ఐదు వాహనాలే ఉండాలని పెద్దారెడ్డికి తేల్చిచెప్పింది. ఆయన ఇంటివద్ద ఏ సమయంలోనైనా 50-60 మందికి మించి ఉండకూడదంది. పెద్దారెడ్డితో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్థితో సమస్య ఏర్పడితే ఎదుర్కొనేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించింది.






