‘పవనన్నా.. కాపాడు!’.. మస్కట్‌లో తెలుగింటి మహిళ ఆర్తనాదం వైరల్

by Ramesh Naini |

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు.

‘పవనన్నా.. కాపాడు!’.. మస్కట్‌లో తెలుగింటి మహిళ ఆర్తనాదం వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు. తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లిన ఆమె.. యజమాని (సేఠ్) చేతిలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొంటున్నట్లు మహిళ తెలిపారు. తనను ఓ గదిలో బంధించి, కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వకుండా నిత్యం దారుణంగా కొడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రాణభయంతో బాత్‌రూమ్‌లో రహస్యంగా రికార్డు చేసిన ఓ వీడియోను ఆమె శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘సేఠ్‌కు తెలిస్తే నన్ను చంపేస్తాడు.. ఫిట్స్‌ వచ్చి చనిపోయేలా ఉన్నా.. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నే నన్ను కాపాడాలి’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తనకు ఏమైనా జరిగితే తన బిడ్డలు దిక్కులేని వారవుతారని, ఎలాగైనా తనను స్వదేశానికి రప్పించి రక్షించాలని ఆ వీడియోలో దీనంగా వేడుకున్నారు.

Next Story