Pawan Kalyan : బీజేపీ - అన్నాడీఎంకే కూటమికి పవన్ శుభాకాంక్షలు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-11 16:26:07  IST  )

తమిళనాడు(Tamilanadu)లో బీజేపీ(BJP), అన్నాడీఎంకే(AIADMK) జట్టు కట్టిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan : బీజేపీ - అన్నాడీఎంకే కూటమికి పవన్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో బీజేపీ(BJP), అన్నాడీఎంకే(AIADMK) జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ - అన్నాడీఎంకే(BJP - AIADMK) కూటమి తమిళనాడు రాజకీయాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తుందని, ప్రజల కోసం బలమైన పాలనను అందిస్తుందని ఆకాంక్షించారు. అలాగే తమిళనాడుకు కాబోయే సీఎం పళనిస్వామికి విషెస్ తెలియజేశారు. ఎన్డీఏ సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్, గతంలో అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (MGR)ను ప్రశంసించిన విషయం తెలిసిందే.

కాగా 2026 ఏప్రిల్ లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె. పళనిస్వామి శుక్రవారం మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన జారీ చేశారు.

Next Story