అడిగిన వెంటనేసహాయ సహకారాలు.. హీరో నానికి పవన్ కృతజ్ఞతలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-02 09:57:40  IST  )

మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. .

అడిగిన వెంటనేసహాయ సహకారాలు.. హీరో నానికి పవన్ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. అయితే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంవో ద్వారా ట్వీట్ చేశారు.

‘‘ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రధాని మోడీ , సీఎం చంద్రబాబు "స్వచ్ఛ భారత్" , "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.’’ అని పేర్కొన్నారు.

Next Story