- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: నా కుమారుడు ప్రమాదానికి గురైనప్పుడు.. అంటూ గుర్తు చేసుకున్న పవన్
వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల (Nurse) దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉపముఖ్యమంత్రి ప్రత్యేక భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ (Nightingale) స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని., నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని తెలిపారు.
విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరని, నర్సులు పడే శ్రమ, కష్టం, కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేమన్నారు. ఇటీవల సింగపూర్ లో నా కుమారుడు మార్క్ శంకర్ (Mark Sankar) ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది అన్నారు. ఈ సందర్భంగా నర్సులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.






