తిరుమలలో పవన్ సతీమణి.. కారణం ఇదేనా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-13 16:00:19  IST  )

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy CM Pawan kalyan)సతీమణి అన్నాలెజినోవా కొణిదల రేపు (ఏప్రిల్ 14న) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమలలో పవన్ సతీమణి.. కారణం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy CM Pawan kalyan) సతీమణి అన్నాలెజినోవా కొణిదల రేపు (ఏప్రిల్ 14న) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ (ఆదివారం) తిరుపతి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు భగవంతుడికి కృతజ్ఞతగా ఏడుకొండల వెంకన్న తలనీలాలు సమర్పించారు.

కాగా, సింగపూర్‌లోని సమ్మర్ క్యాంప్ స్కూల్లో ఏప్రిల్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. త‌న కుమారుడి ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ హుటాహుటిన సింగ‌పూర్ వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

Next Story