- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చి వేశాలు వేస్తే.. తొక్కిపట్టి నార తీస్తాం: పవన్ కల్యాణ్ హెచ్చరిక
వైసీపీ(YCP) నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలే ఇప్పుడూ చేస్తున్నారని మండిపడ్డారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. అవన్నీ సినిమాల్లోనే బాగుంటాయని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉంటున్నాం. ఎన్నో దెబ్బలు తిని, ఇక్కడి వరకు వచ్చాం. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం. ప్రజల్లో భయాందోళన కలిగించాలని చూస్తే సహించం’’ అని పవన్ హెచ్చరించారు. అంతేకాదు.. వైసీపీకి ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్య కూడా లేదు.. కానీ ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే రోజురోజుకూ దిగజారి వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే తాము సైలెంట్ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మా మౌనాన్ని చేతగాని తనంగా చూడొద్దు. మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






