ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన

by Muthe.Rajitha |

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పర్యటించారు.

ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పర్యటించారు. పవన్ రాకతో గ్రామస్థులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు, ప్రహరీలు కూల్చివేతకు గురైన బాధితులతో మాట్లాడారు. 2022లో ప్రతిపక్ష నేతగా అప్పట్లో గ్రామానికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ వస్తానని ఇచ్చిన హామీని ఆయన ఇప్పుడు నెరవేర్చారు.

ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలోని వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను స్వయంగా కలిసిన పవన్ కల్యాణ్ ఆమెకు రూ.50 వేల ఆర్థిక సాయం, ఆమె మనవడికి రూ.1 లక్ష సహాయం అందజేశారు. గతంలో పోలీసులు అడ్డుకున్నా కాలినడకన వెళ్లి బాధితులను పరామర్శించిన పవన్, ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా మరోసారి గ్రామానికి వచ్చి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story