- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇవాళ చాలా ఆనందంగా ఉంది’.. పవన్ కల్యాణ్ ట్వీట్
పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం ఉప్పాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం ఉప్పాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘ఇవాళ నా మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
తీసుకోనున్న చర్యల వివరాలు:
• సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది.
• ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కొత్త నుండి ప్రజలను కాపాడేందుకు రూ.323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి సహకారంతో రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇస్తున్నాను.
• ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు రూ.98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నాము.
• మత్స్యకారులతో "మాట - మంతి" కార్యక్రమం నిర్వహించిన సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు 100 రోజుల గడువులోగా స్పష్టమైన ప్రణాళికను, ప్రజల ఆమోదంతో అమలు చేయనున్నాము.
• సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటాను అని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.






