జాతీయ స్థాయిలో ఏపీకి రెండో స్థానం.. పవన్ కల్యాణ్ హర్షం మామూలుగా లేదుగా..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-10 10:52:16  IST  )

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని NDA ప్రభుత్వం, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

జాతీయ స్థాయిలో ఏపీకి రెండో స్థానం.. పవన్ కల్యాణ్ హర్షం మామూలుగా లేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నేతృత్వంలోని NDA ప్రభుత్వం, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ(Panchayat Raj & Rural Development Department) ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో స్థానం దక్కడం గర్వకారణమని ఆయన తెలిపారు. వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి, గ్రామ ప్రజలకు, అలాగే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి మనస్పూర్తిగా తాను అభినందనలు తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్..

Next Story