- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధితులు ఇళ్లకు వెళ్లడానికి ముందే సాయం చేస్తాం: పవన్ కల్యాణ్ హామీ
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురువారం పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురువారం పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంటనష్టాన్ని స్వయంగా తెలుసుకున్నారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా, పరిహారం చెల్లింపులు చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో, ప్రభుత్వ ముందస్తు సన్నద్దత మూలంగా నష్టం తీవ్రత తగ్గిందని అన్నారు. లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతు పనులు చేస్తామని అన్నారు. గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలు పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్లడానికి ముందే బాధితులకు వెయ్యి ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా, మొంథా తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తెలిపారు.






