అలాంటి రోజు వస్తే.. రాజకీయాలు వదిలేస్తా: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ మరియు సమీప ప్రాంతాల సాగర తీరంలో పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు.

అలాంటి రోజు వస్తే.. రాజకీయాలు వదిలేస్తా: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ మరియు సమీప ప్రాంతాల సాగర తీరంలో పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారని తెలిపారు. మత్స్యకారులు తెలియచేసిన ప్రతి సమస్యను, వారి అభిప్రాయాలను అర్ధం చేసుకుని 100 రోజుల లోపు పరిష్కారానికి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా కాలుష్య పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. మత్స్యకారులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

‘అభివృద్ధితోపాటు పర్యావరణం కూడా ముఖ్యమే. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో చాలా ఇబ్బంది అవుతోంది. 7,193 కుటుంబాలు వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. దివిస్‌, అరబిందో కంపెనీల నుంచి కాలుష్యం విడుదలవుతోంది. కాలుష్యం సమస్య పరిష్కారానికి 100 రోజుల టైమ్‌ కావాలి. నేనే స్వయంగా కాలుష్యాన్ని పరిశీలిస్తా. మత్స్యకారులతో కలసి బోటు తీసుకుని వెళ్తా. సమస్య పరిష్కరించలేనప్పుడు రాజకీయాలు వదిలేస్తా’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story